Sun Dec 22 2024 16:16:47 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu RealEstate IT Raids:రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
Tamilnadu RealEstate IT Raids:తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జాము నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఢిల్లీ నుంచి వచ్చి ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
పన్ను ఎగవేత ఆరోపణలపై...
తమిళనాడులో రియల్ ఎస్టేట్ సంస్థలు ఆదాయపు పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. అనేక సంస్థలతో పాటు వాటికి సంబంధించిన యజమానుల ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని, సోదాల తర్వాత అధికారికంగా చెబుతామని అధికారులు అంటున్నారు.
Next Story