Fri Dec 27 2024 20:40:20 GMT+0000 (Coordinated Universal Time)
యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్
భారత్ లో మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళన కల్గిస్తుంది
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. వైరస్ అదుపులోనే ఉంది. మూడు వేలకు దిగువనే కేసులు నమోదవుతున్నాయి. అయితే మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళన కల్గిస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కరోజులో 2,41,707 మందికి పరీక్షలు నిర్వహించగా 2,430 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
వ్యాక్సినేషన్....
దేశంలో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత్ లో 5,28,874 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతం నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.06 శాతంగా నమోదయింది. దేశంలో ప్రస్తుతం 26,618 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 219.27 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story