Wed Apr 09 2025 03:34:07 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : ఫెస్టివల్ మూమెంట్.. కేసులు చూస్తే మాత్రం మామూలుగా లేవుగా
పండగల సీజన్ లో కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

పండగల సీజన్ లో కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కరోనా వైరస్ కేసులతో పాటు జేఎన్ 1 వేరియంట్ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో 137 జేఎన్ 1 వేరియంట్ కేసులు కొత్తగా నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ప్రస్తుతుం జేఎన్ 1 వేరియంట్ కేసులు 819 కి పెరిగాయి. దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మరణాల సంఖ్య కూడా...
ఇక దేశంలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 475 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో అత్యధికంగా కర్ణాటకలోనే నమోదయ్యాయి.ఒక్క కర్ణాటకలోనే 279 కేసులు కొత్తగా నమోదయినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 61, కేరళలో 51 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒక్కరోజులో ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గడ్ లో ఇద్దరు, అసోంలో ఒకరు కరోనాతో మరణించారు.
Next Story