Wed Apr 23 2025 04:16:21 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే విమానంలో నితీష్.. తేజస్వి.. ఏమైనా జరగొచ్చా?
నేడు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది

నేడు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న దానిపై భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. అటు ఎన్డీఏ కూటమి సమావేశం కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరగనుంది.
నితీష్, తేజ్వస్వి...
దేశ అవసరాల దృష్ట్యా, ప్రజల ఆకాంక్షల మేరకు కొన్ని పార్టీలను ఇండియా కూటమిలోకి ఆహ్వనించేందుకు సిద్ధమవుతూ ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఒకవేళ వీలుకాకపోతే బలమైన ప్రతిపక్షంగా ఉండాలని కూడా నిర్ణయించే అవకాశముంది. అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు పాట్నా నుంచి ఒకే విమానంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఢిల్లీకి బయలేదరి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇండియా కూటమిలో కి నితీష్ కుమార్ ను ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన కాకతాళీయంగా జరిగిందా? లేక ఇద్దరు అనుకుని ఒకే విమానంలో బయలుదేరారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story