Tue Nov 19 2024 05:37:19 GMT+0000 (Coordinated Universal Time)
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు
ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చరికలతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది.
కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ ను అంత తక్కువ అంచనా వేయొద్దని, భవిష్యత్ లో ఒమిక్రాన్ తన రూపాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చని, తద్వారా ప్రమాదం పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది. ఈ మేరకు భారత్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
వచ్చే ఏడాది జనవరి...
ప్రస్తుతం అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తాత్కాలికంగా ఉన్న నిషేధాన్ని 2022, జనవరి 31 వరకూ పొడిగిస్తూ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధించిన నిషేధం ఈనెల 15వ తేదీతో ముగియనుండగా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తాత్కాలిక నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు భారత్ వివరించింది.
Next Story