‘ఇండియా’ పుట్టుపూర్వత్రాలు
టిబెట్ ప్రాంతంలోని హిమాలయాల నుంచి ప్రవహించే ఇండస్ (సింధు)నది 2,900 కిమీ ప్రవహిస్తుంది. దీని పరీవాహకప్రాంతమైన మన దేశాన్నిఆంగ్లేయులు ఇండియాగా పిలిస్తే, మొఘలాయిలు ఈ సింధునదిని హిందూ అని పిలవడం వల్ల హిందూదేశంగా పిలుస్తారు.
‘ఇండియా’ పుట్టుపూర్వత్రాలు
టిబెట్ ప్రాంతంలోని హిమాలయాల నుంచి ప్రవహించే ఇండస్ (సింధు)నది 2,900 కిమీ ప్రవహిస్తుంది. దీని పరీవాహకప్రాంతమైన మన దేశాన్నిఆంగ్లేయులు ఇండియాగా పిలిస్తే, మొఘలాయిలు ఈ సింధునదిని హిందూ అని పిలవడం వల్ల హిందూదేశంగా పిలుస్తారు. వాస్తవానికి హిందూ పదంలేదని చరిత్రకారుల వాదన. సింధూనది మనదేశంలోని వాయువ్య ప్రాంతం, కాశ్మీర్ లోయతో పాటు, ఉత్తర పాకిస్తాన్ లో కూడా ప్రవహిస్తుంది. ఇండస్ నది లోయప్రాంతంలోనే 3300-1300బీసీ వరకు తొలి నాగరికత వేదికలైన హరప్పా, మొహంజదారో వెల్లివిరిశాయి.
INDIAను మేం తీసుకుంటాం...
ఇండియా పేరు మాకు సరిపోతుందని, మేం తీసుకుంటామని పొరుగు దేశం పాకిస్తాన్ చెబుతోంది. దీనిపై భారతీయులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఇండియా పేరును పాక్ తీసుకోకుండా మనకే ఉండేట్లు ఐక్యరాజ్య సమితిని కోరాలన్నారు. మనలో మనమాట మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1ను యధాతదంగా అమలు చేస్తే ఈ పాట్లు ఉండవుగా..
‘ఇండియా’ను జిన్నా వ్యతిరేకించారు
స్వాతంత్ర్యం పొందిన భారత దేశానికి ఇండియా అని పేరు పెట్టడాన్ని మహ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించారని సౌత్ ఆసియా ఇండెక్స్ తెలిపింది. మన దేశానికి హిందుస్తాన్ లేదా భారత్ పేరు పెట్టాలని జిన్నా కోరారని తెలిపింది. స్వాతంత్ర్యానంతరం ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కు గౌరవాధ్యక్షుడిగా ఉండాలని లూయిస్ ఆహ్వానించగా, అందులో ఇండియా అని ఉండటంతో, ఆయన తిరస్కరించారని సౌత్ ఆసియా ఇండెక్స్ వివరించింది.
దేశం పేరు మార్పుపై అభ్యర్థిస్తే ఆమోదిస్తాం
ఇండియా పేరును భారత్ గా మార్చమని అధికారికంగా అభ్యర్థిస్తే ఆమోదిస్తామని ఐక్యరాజ్య సమితి అధికారి ఒకరు తెలిపారు. గతేడాది టర్కీ పేరును ఆదేశం కోరిక మేరకు తుర్కియాగా మార్చామన్నారు.
కామెంట్లు వద్దు
భారత్ , ఇండియా పేర్లపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎటువంటి కామెంట్లు చేయవద్దని ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కోరారు. చారిత్రక అంశాలపై వివరణ ఇవ్వకుండా వాస్తవాలను చూపుతూ సమకాలీన అంశాలపై స్పందించాలని ఆయన సలహా ఇచ్చారు.
సినిమాల్లోనూ ‘భారత్’
దేశం పేరు మార్పును సినీ పరిశ్రమ ఆఘమేఘాలపై ఆమోదిస్తోంది. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ ట్యాగ్ లైన్ ‘ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ లోని ఇండియన్ పేరును మార్చి ‘ది గ్రేట్ భారత్ రెస్క్యూ’ గా కొత్త వాల్ పోస్టర్లు ముద్రించారు.
లాలూ పాత వీడియో వైరల్
ఇండియా పేరు మార్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ఇండియా – భారత్ వ్యత్యాసం గురించి వివరిస్తూ, ఢిల్లీని ఇండియాగా, పాట్నాను భారత్ గా అభివర్ణించారు. ఢిల్లీలో దంతప్రక్షాళన చేసే వేపపుల్ల దొరకదని, పాట్నాలో ఎక్కువగా దొరుకుతాయని ఆయన సెలవిచ్చారు.