Mon Dec 23 2024 08:46:57 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా: ప్రధాని మోదీ
చంద్రయాన్ 3కి సంబంధించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవాన్ని విజయవంతంగా తాకిన
చంద్రయాన్ 3కి సంబంధించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవాన్ని విజయవంతంగా తాకిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో వాస్తవంగా ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించిన మోదీ దీన్ని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. భారత అంతరిక్ష రంగానికి చారిత్రాత్మక రోజని.. చంద్రయాన్-3 లూనార్ మిషన్ అద్భుతమైన విజయానికి ఇస్రోకి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. "హమ్నే ధర్తీ పర్ సంకల్ప్ కియా ఔర్ చంద్ పే ఉస్సే సకార్ కియా...ఇండియా నౌ ఆన్ మూన్", అని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని అన్నారు. చంద్రుని ఉపరితలం మీద దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించడాన్ని భారీ సక్సెస్ గా అభివర్ణించారు ప్రధాని మోదీ. "నేను దక్షిణాఫ్రికాలో ఉండచ్చు కానీ నా హృదయం చంద్రయాన్ మిషన్‌తోనే ఉంది" అని మోదీ అన్నారు.
ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని ప్రధాని మోదీ అన్నారు. అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారని.. ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టామని అన్నారు. ఇన్ని రోజులు చంద్రుడు మనకు చాలా దూరంగా ఉన్నాడని అనుకుంటూ ఉండేవాళ్లమని.. ఇకపై ఆ దూరం తగ్గిందనిపిస్తోందని అన్నారు. చంద్రయాన్ ఘన విజయంతో నా జీవితం ధన్యమైందని అన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని తెలిపారు. అమృత కాలంలో తొలి ఘన విజయం సాధించామని తెలిపారు ప్రధాని మోదీ.
బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశించిన ప్రాంతానికి చేరింది. ఇస్రో సైంటిస్టులు పంపించిన ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్‌ను అనుసరించి తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. నాలుగు థ్రాటబుల్‌ఇంజిన్లను ప్రజ్వలించి వేగాన్ని తగ్గించుకుని రఫ్ బ్రేకింగ్ దశను ముగించుకుని చంద్రుడి ఉపరితం చేరుకుంది. చంద్రుడికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ తన దిశను మార్చుకుంది. దశల వారీగా కిందకు దిగుతూ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశంలో కాలుమోపడంతో అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగగా ఇకపై పరిశోధనలను రోవర్ చేపట్టనుంది.
Next Story