Wed Apr 02 2025 22:29:55 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్
కొత్త వేరియంట్ పై భారత్ అప్రమత్తమయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

కరోనాతో ఇప్పుడిప్పుడే మళ్లీ జీవితాలు మొదలయ్యాయి. వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో సినిమా హాళ్లలో వంద శాతం సీట్లు భర్తీ చేసుకునేలా ఆంక్షలు తొలగించారు. కానీ కేంద్ర ప్రభుత్వం సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ప్రపంచ వ్యాప్తంగా కలవరం ప్రారంభమయ్యాయి. అనేక దేశాలు ఎయిర్ ట్రాఫిక్ పై ఆంక్షలు విధించాయి.
ఆరోగ్య సదుపాయాలను...
తాజాగా భారత్ కూడా అప్రమత్తమయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శఆఖ అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను తిరిగి కఠినతరం చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్ లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెస్ట్, ట్రేసింగ్ లపై ఫోకస్ పెంచాలని కోరింది. ఏమాత్రం అలక్ష్యం చేసినా కొత్త వేరియంట్ చుట్టుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆరోగ్య సదుపాయాలను పెంచుకోవాలని కూడా కోరింది.
- Tags
- new variant
- india
Next Story