Mon Dec 23 2024 15:05:21 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone : తుపాను ముప్పు.. అప్రమత్తమైన యంత్రాంగం
భారత్ ను ఒకేసారి రెండు తుపాన్లు చుట్టుముడుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది
భారత్ ను ఒకేసారి రెండు తుపాన్లు చుట్టుముడుతున్నాయి. అరేబియా మహా సముద్రంలో తేజ్ తుపాన్ తో పాటుగా బంగాళాఖాతంలో హమూన్ తుపాన్ కూడా ఒకేసారి ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తేజ్ తుపాను ఈ నెల 22 న తీవ్ర తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది. ఈ తుపాను ఆల్గైదా, సలాలా మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్య కారులను చేపలవేటకు వెళ్లవద్దని ప్రభుత్వాలు నిషేధం విధించాయి.
ఒకేసారి రెండు తుపాన్లు...
దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు దూసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్, మరోవైపు బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీనివల్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఇక హమూన్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశముందని పేర్కొంది. కేరళ, తమిళనాడుతో పాటు ఏపీ కోస్తా తీర ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే మబ్బులు కమ్ముకున్నాయి.
Next Story