Mon Dec 23 2024 14:37:55 GMT+0000 (Coordinated Universal Time)
స్కైమెట్ అంచనా ప్రకారం.. ఈ ఏడాది వర్షపాతం ఇలా ఉండనుంది
కానీ ఇప్పుడు లానినా ముగియగా.. ఎల్ నినో పెరుగుతోందని స్కైమెట్ పేర్కొంది. వర్షాకాలానికి ఎల్ నినో..
2023లో వర్షపాతం ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ తాజాగా వెల్లడించింది. స్కైమెట్ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది అన్నదాతలకు అంత మంచికాలం కాదేమో అన్నట్లుగా ఉంది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ కాలానికి వర్షాలు దీర్ఘకాల సగటులో 94 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
లానినా ప్రభావంతో (అనుకూలం) నైరుతి రుతుపవన కాలంలో గత నాలుగు సీజన్ల నుంచి సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ ఇప్పుడు లానినా ముగియగా.. ఎల్ నినో పెరుగుతోందని స్కైమెట్ పేర్కొంది. వర్షాకాలానికి ఎల్ నినో ప్రభావం మరింత పెరగనున్న నేపథ్యంలో వర్షాలు తక్కువగా పడొచ్చని స్కైమెట్ ఎండీ జతిన్ సింగ్ వెల్లడించారు. అయితే ఉత్తర భారతం-మధ్యభారత్ లోని ప్రాంతాలు అధిక వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది.
గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో జూలై, ఆగస్ట్ లో సరైన వర్షపాతం ఉండకపోవచ్చని పేర్కొంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ ఇంకా అధికారికంగా వర్షపాత అంచనాలను ప్రకటించలేదు కానీ.. ఈ ఏడాది సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మాత్రం తెలిపింది.
Next Story