Mon Dec 23 2024 10:47:48 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో క్రమంగా తగ్గుతోన్న కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో 1,11,472 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నట్లు..
న్యూ ఢిల్లీ : భారత్ లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గింది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో కొత్తగా 10,273 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 20,439 మంది కరోనా నుంచి కోలుకోగా.. 243 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు.
Also Read : నేడు భారత్ కు మూడో విమానం
ప్రస్తుతం దేశంలో 1,11,472 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. అలాగే రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 1 శాతానికి తగ్గినట్లు తెలిపింది. కాగా.. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,22,90,921 గా ఉంది. అలాగే 5.13.724 మంది కరోనా బాధితులు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో ఇప్పటి వరకూ 177,44,08,129 డోసుల కరోనా వ్యాక్సిన్లను వినియోగించినట్లు తెలిపింది.
News Summary - India Records 10,273 Fresh COVID-19 Cases, 243 Deaths in 24 hours
Next Story