Mon Dec 23 2024 13:33:37 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కొత్తగా 861 పాజిటివ్ కేసులు, 6గురు మృతి
గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనాతో మృతి చెందగా.. మృతుల సంఖ్య 5,21,691కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో..
న్యూ ఢిల్లీ : భారత్ లో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 929 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కరోనా బులెటిన్ లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,30,36,132కు చేరింది. వీరిలో 4,25,03,383 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనాతో మృతి చెందగా.. మృతుల సంఖ్య 5,21,691కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్గా ఉన్నది 0.03 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటిరకు 1,85,74,18,827 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా.. నిన్న ఒక్కరోజే 2,44,870 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది.
Next Story