Tue Nov 05 2024 09:24:06 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో మరింత తగ్గిన పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్నికేసులంటే ?
కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24
భారత్ లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,270 మంది కరోనా బారిన పడగా.. 325 మంది మృతి చెందారు. గురువారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఈరోజు నమోదైన కేసులు మరింత తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 2,53,739 కేసులు యాక్టివ్ గా ఉండగా.. వారంతా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read : విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీ కొని నలుగురి మృతి
ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 4,28,02,505 కరోనా కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 5,11,230కి చేరింది. భారత్ లో ఇప్పటి వరకూ 175.03 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మిజోరాం లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
Next Story