Mon Dec 23 2024 08:47:31 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా కోవిడ్ అప్డేట్.. కరోనాతో 67 మంది మృతి
తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. దానిప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 6.6 లక్షల మందికి
న్యూ ఢిల్లీ : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. కొద్దిరోజులుగా రెండు వేల దిగువకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. దానిప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 6.6 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1938 మందికి పాజిటివ్ గా తేలింది.
ఇదే సమయంలో 2,531 మంది కరోనా నుంచి కోలుకోగా.. 67 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 22, 427 యాక్టివ్ కేసులున్నారు. ఇప్పటివరకూ భారత్ లో 4,24,75,588 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 182 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ వేయగా.. నిన్న ఒక్కరోజే 31.8 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
Next Story