Mon Dec 23 2024 12:59:26 GMT+0000 (Coordinated Universal Time)
కోవిడ్ అప్ డేట్ : దేశంలో పెరిగిన ఒమిక్రాన్ కేసులు
తాజాగా దేశంలో 6,650 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో
ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను సైతం ఒమిక్రాన్ భయపెడుతోంది. దేశవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు జరగడంతో.. కోవిడ్, ఒమిక్రాన్ ల వ్యాప్తి తీవ్రమవుతోంది. తాజాగా దేశంలో 6,650 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో మరో 7,051 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 374 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 77,516 యాక్టివ్ కేసులుండగా.. వారంతా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఇప్పటి వరకూ దేశంలో 3,42,15,977 మంది కరోనా నుంచి కోలుకున్నారని, అదే సమయంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,79,133కు పెరిగిందని కేంద్ర వైద్యారోగ్య వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఇప్పటి వరకూ 358 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో వెలుగుచూసినట్లు తెలిపింది. ఒమిక్రాన్ ను తట్టుకోవాలంటే.. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలో ఇప్పటి వరకూ 140,31,63,063 వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
Next Story