Mon Dec 23 2024 13:21:21 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కరోనా ఉద్ధృతి.. 22 లక్షలకు పెరిగిన యాక్టివ్ కేసులు
తాజాగా నమోదైన కేసులతో కలిపి.. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కి పెరిగింది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,91,700కి
భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో.. గడిచిన 24 గంటల్లో 2,86,384 మందికి పాజిటివ్ గా తేలినట్లు వెల్లడైంది. ఇదే సమయంలో 573 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా.. మరో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి.. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కి పెరిగింది.
Also Read : రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విడుదల
వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,91,700కి చేరింది. కాగా.. ఇప్పటివరకూ దేశంలో 1,63,84,39,207 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఇదిలా ఉండగా.. గడిచిన వారంరోజుల్లో 2 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. భారీస్థాయిలో కేసులు నమోదవ్వడంపై డబ్ల్యూహెచ్ఓ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Next Story