Mon Dec 23 2024 15:02:26 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో పెరిగిన కరోనా కేసులు
అంతకుముందు రోజుతో పోలిస్తే.. 292 కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,38,016కు పెరిగాయి.
న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం 1088 మంది కరోనా బారిన పడ్డారు. అంతకుముందు రోజుతో పోలిస్తే.. 292 కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,38,016కు పెరిగాయి. గత 24 గంటల్లో మరో 26 మంది మహమ్మారి బారిన పడి బలవ్వగా.. మృతుల సంఖ్య 5,21,736కి పెరిగింది.
ఇదిలా ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో 10,870 యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 1081 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 4,25,05,410కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.
Next Story