Sat Nov 23 2024 02:16:00 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి
నిన్నటితో పోలిస్తే.. నేటి బులెటిన్ లో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గి, రికవరీల సంఖ్య పెరిగింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన
భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. జూన్ నుంచి ఫోర్త్ వేవ్ మొదలవుతుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో.. కొద్దిరోజులుగా దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే.. నేటి బులెటిన్ లో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గి, రికవరీల సంఖ్య పెరిగింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆదివారంతో పోలిస్తే.. 2.2 శాతం కేసులు తగ్గినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదే సమయంలో కరోనా నుంచి 1970 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,636 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఢిల్లీ సహా 12 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 187.95 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.
Next Story