Mon Dec 23 2024 10:55:26 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
ఇదే సమయంలో 3,230 మంది కరోనా నుంచి కోలుకోగా.. 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కేసులు వరుసగా రెండో రోజు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 4.71 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,827 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే సమయంలో 3,230 మంది కరోనా నుంచి కోలుకోగా.. 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,13,413కు చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,70,165 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,181కి చేరుకుంది.
ఇదిలా మరోవైపు టమాటా ఫ్లూ కేరళను వణికిస్తోంది. కొత్తవ్యాధితో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ 80కి పైగా కేసులు నమోదయ్యాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో టమాటా ఫ్లూ కనిపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధి ఎందుకొస్తుందన్న దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.
Next Story