Sat Nov 23 2024 01:46:26 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
ఇప్పటి వరకూ 4,25,66,935 మంది కరోనా బాధితులు కోలుకోగా... 5,24,157 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,494 యాక్టివ్..
న్యూఢిల్లీ : భారత్ లో మొన్నటి వరకూ 3 వేలకు పైగా నమోదైన రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 4.72 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,897 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 2,986 మంది కరోనా నుంచి కోలుకోగా.. 54 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 4,31,10,586కి చేరుకుంది.
ఇప్పటి వరకూ 4,25,66,935 మంది కరోనా బాధితులు కోలుకోగా... 5,24,157 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,494 యాక్టివ్ కేసులు ఉండగా.. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.05 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 190 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది.
Next Story