Mon Dec 23 2024 11:13:57 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కేసులు
ప్రస్తుతం దేశంలో 19,509 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొద్దిరోజులుగా దేశంలో మూడువేల పై చిలుకు కేసులు నమోదవుతుండటంతో..
న్యూ ఢిల్లీ : భారత్ లో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో దేశంలో 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,88,118కి చేరింది. ఇదే సమయంలో 31 మంది కరోనాకు బలవ్వడంతో.. మృతుల సంఖ్య 5,23,920కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 2802 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య.. 4,25,44,689గా ఉంది.
ప్రస్తుతం దేశంలో 19,509 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొద్దిరోజులుగా దేశంలో మూడువేల పై చిలుకు కేసులు నమోదవుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, మంగళవారం ఒక్కరోజే 4,79,208 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
Next Story