Sat Nov 23 2024 01:51:26 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ వచ్చేస్తోందా ?
రెండున్నరవేలకు పైగా నమోదవుతూ వచ్చిన రోజువారీ కేసుల సంఖ్య ఇప్పుడు మూడు వేలకు పెరిగింది. దీంతో ఫోర్త్ వేవ్ సూచనలు ..
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. కొద్దిరోజులుగా రెండువేలు, రెండున్నరవేలకు పైగా నమోదవుతూ వచ్చిన రోజువారీ కేసుల సంఖ్య ఇప్పుడు మూడు వేలకు పెరిగింది. దీంతో ఫోర్త్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల్లో దాదాపు 5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా..3,303 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో పాజిటివిటీ రేటు 0.6 శాతానికి పెరిగింది.
తాజాగా నమోదైన ఈ కేసుల్లో 1367 కేసులు ఢిల్లీ రాష్ట్రంలోనే నమోదవ్వడం కలవరపెడుతోంది. యూపీ, హర్యానా, మిజోరాం, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో 2,563 మంది కరోనా నుంచి కోలుకోగా.. 39 మంది కరోనా కారణంగా చనిపోగా.. 36 మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. రోజువారీ కేసులు పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 16,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 188 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Next Story