Mon Dec 23 2024 13:47:18 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా కరోనా అప్డేట్.. వెయ్యి దిగువకు కేసులు!
ప్రస్తుతం దేశంలో 11,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 186.30 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య
న్యూ ఢిల్లీ : భారత్ లో రోజువారి కరోనా కేసులు తగ్గుతున్నాయి. మూడు-నాలుగు రోజులుగా వెయ్యికి పైగా నమోదైన కేసులు.. నేడు వెయ్యి దిగువకు చేరాయి. గత 24 గంటల్లో దేశంలో 3,67,213 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 949 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇదే సమయంలో ఆరుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 5,21,743కి పెరిగింది.
అలాగే మరో 810 మంది మహమ్మారి నుంచి కోలుకోవడంతో.. రికవరీల సంఖ్య 4,25,07,038కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 186.30 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. ఢిల్లీలో రోజువారి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ల హెచ్చరికతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే బూస్టర్ డోసు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే ఈ డోసులు అందుబాటులో ఉన్నాయి.
Next Story