Mon Dec 23 2024 13:26:15 GMT+0000 (Coordinated Universal Time)
తరుముతోన్న ఫోర్త్ వేవ్.. భారత్ లో స్వల్పంగా పెరిగిన కేసులు
భారత్ ను కరోనా ఫోర్త్ వేవ్ భయం వెంటాడుతోంది. జూన్ లేదా జులై నెలల్లో ఫోర్త్ వేవ్ రావచ్చునని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు.
న్యూఢిల్లీ : ఒకపక్క చైనాలో రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. అక్కడ అన్ని నగరాల్లోనూ కఠినమైన కోవిడ్ ఆంక్షలు పెట్టారు. భారత్ ను కరోనా ఫోర్త్ వేవ్ భయం వెంటాడుతోంది. జూన్ లేదా జులై నెలల్లో ఫోర్త్ వేవ్ రావచ్చునని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. తాజాగా భారత్ లో గడిచిన 24 గంటల్లో 975 కొత్తకేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 796 మంది కోలుకోగా.. మరో నలుగురు మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో 11,366 యాక్టివ్ కేసులు ఉండగా.. ముందు రోజుతో పోలిస్తే 175 యాక్టివ్ కేసులు పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 4,30,39,972 కేసులు నమోదవ్వగా.. 4,25,07,834 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 186.38 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగింది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ ఉంది.
Next Story