Mon Dec 23 2024 08:24:12 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే
తాజాగా మరోసారి రెండున్నరవేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా..
న్యూ ఢిల్లీ : భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా 2 వేల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరోసారి రెండున్నరవేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 2,593 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 15,873 యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో 1755 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
ఇదే సమయంలో కరోనాతో పోరాడుతున్న 44 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఇప్పటివరకూ దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,22,193కి పెరిగింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,25,19,479 గా ఉందని తెలిపింది. నిన్న దేశంలో 19,05,374 డోసుల వ్యాక్సిన్లు వేశామన్న కేంద్రం.. ఇప్పటి వరకు మొత్తం 187,67,20,318 డోసుల వ్యాక్సిన్లు వినియోగించినట్లు పేర్కొంది.
Next Story