Wed Jan 15 2025 13:05:06 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ను వణికిస్తున్న కరోనా.. ఒమిక్రాన్
భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉన్నట్లే కన్పిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 37,379 మందికి కరోనా సోకింది.
భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉన్నట్లే కన్పిస్తుంది. కరోనా కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. తాజాగా 37,379 మందికి కరోనా సోకింది. 124 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకూ భారత్ లో 3,49,60,261 మందికి కరోనా సోకింది.
యాక్టివ్ కేసులు...
వీరిలో 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 4,82,017 మంది మరణించారు. యాక్టివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,71,830 యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 1,46,70,18, 464 కరోనా వ్యాక్సిన్ లు వేసుకున్నారు.
రెండువేలకు చేరువలో.....
ఇక మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారత్ లో భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 1,892 మందికి ఒమిక్రాన్ సోకింది. ఒక్క మహారాష్ట్రలోనే 568 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు. 23 రాష్ట్రాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఢిల్లీలో 382, రాజస్థాన్ లో 174, గుజరాత్ లో 152, తమిళనాడులో 121, తెలంగాణలో 72, కర్ణాటకలో 64, హర్యానాలో 63, ఒడిశాలో 37 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Next Story