Sun Dec 22 2024 21:54:01 GMT+0000 (Coordinated Universal Time)
కేఎల్ రాహుల్ - అతియా దంపతులకు ప్రముఖుల ఖరీదైన బహుమతులు
రాహుల్ వివాహం సందర్భంగా అతని సహచర క్రికెటర్లు.. ఖరీదైన బహుమతుల్ని పంపారు. టీమిండియా మాజీ క్రికెటర్..
ప్రముఖ భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియాశెట్టిని ఈనెల 23న పూణె సమీపంలోని ఖండాలాలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ లో అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. రాహుల్ వివాహం సందర్భంగా అతని సహచర క్రికెటర్లు.. ఖరీదైన బహుమతుల్ని పంపారు. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసాకి నింజా బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క జంట ఏకంగా సుమారు రూ.2.70 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారుని బహుకరించారు.
నిజానికి వారికి వివాహ ఆహ్వానాలు వెళ్లినప్పటికీ.. బిజీ షెడ్యుల్ కారణంగా వీరు వివాహానికి రాలేదు కానీ.. కానుకలు పంపారని సమాచారం. అతియా శెట్టి తల్లిదండ్రులైన సునీల్ శెట్టి, ఆయన భార్య కలిసి ముంబైలో రూ.50 కోట్ల విలువ చేసే అపార్ట్ మెంట్ ను కానుకగా ఇచ్చారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రూ.1.6 కోట్ల విలువ చేసే ఆడి కారు బహూకరించాడు. జాకీ ష్రాఫ్ రూ.30 లక్షలు, అర్జున్ కపూర్ రూ.1.5 కోట్ల విలువ చేసే బ్రాస్ లెట్ లను అతియాకు అందించారు.
Next Story