Mon Dec 23 2024 19:14:32 GMT+0000 (Coordinated Universal Time)
10 రోజుల్లో రెండోసారి అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణిని పరీక్షించిన భారత్
షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి
షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మిస్సైల్‌ను పరీక్షించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్షిపణిని డీఆర్డీవో దేశీయంగా అభివృద్ధి చేసింది. పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి. ఈ క్షిపణిని గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో కూడా విజయవంతంగా పరీక్షించారు.
10 రోజుల్లో అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణిని భారత్ ప్రయోగించడం ఇది రెండోసారి. పృథ్వీ-II అనేది స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి, ఒక టన్ను పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. జూన్ 6న 4,000 కి.మీ దూరం ప్రయాణించగల ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-IVని భారత్ పరీక్షించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరీక్ష జరిగింది.
News Summary - Prithvi-II is an indigenously developed surface-to-surface missile, which has a range of around 250 km and can carry a one tonne payload
Next Story