Tue Dec 24 2024 01:11:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు బాబు బయటపడ్డాడు
కేరళ కొండ చరియల్లో ఇరుక్కున్న బాబును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం రక్షించింది
కేరళ కొండ చరియల్లో ఇరుక్కున్న బాబును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం రక్షించింది. దాదాపు నలభై మూడు గంటలుగా కేరళకు చెందిన బాబు కొండ చరియల్లో ఇరుక్కుపోయారు. ఇద్దరు స్నేహితులతో కలసి సోమవారం పాలక్కాడ్ జిల్లాలోని కొండచరియలకు ట్రెక్కింగ్ కు వెళ్లాడు. అయితే స్నేహితులు కొండ ఎక్కలేక మధ్యలోనే వెనుదిరిగారు. బాబు మాత్రం కొండ చివరకు వెళ్లి చరియల్లో ఇరుక్కుపోయాడు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్....
43 గంటల నుంచి బాబుకు తిండీ తిప్పలు లేవు. అధికారులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైన్యం సాయాన్ని కోరారు. ఈరోజు ఎయిర్ ఫోర్స్ టీం అక్కడకు చేరుకుని బాబును రక్షించింది. సురక్షితంగా కిందకు తీసుకు వచ్చింది. వెంటనే బాబుకు ప్రాధమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.
Next Story