Mon Dec 23 2024 11:05:18 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ .. ఇద్దరు గల్లంతు
గురువారం బొమ్డిల పట్టణానికి పశ్చిమాన మండాల అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలినట్లు గుర్తించారు. ఉదయం 9.15 గంటలకు..
భారత వైమానిక దళానికి చెందిన చీతా అనే హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోగా.. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారు. గురువారం బొమ్డిల పట్టణానికి పశ్చిమాన మండాల అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలినట్లు గుర్తించారు. ఉదయం 9.15 గంటలకు చీతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు గువాహటి రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తోందని, ఉన్నట్టుండి దాని ఆచూకీ కనిపించలేదన్నారు.
చీతాలో ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ పైలట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో ఇద్దరూ కనిపించలేదు. దాంతో గాలింపు బృందాలను రంగంలోకి దించారు. వైమానిక దళంలో చేతక్, చీత రకం హెలికాప్టర్లు 200 వరకు సేవలు అందిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాలలో సాయుధ బలగాలకు వీటిని రక్షణగా ఉపయోగిస్తున్నారు.
Next Story