Sat Nov 23 2024 12:37:12 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ బోటులో 280 కోట్ల హెరాయిన్.. పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్
బోటులో రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు కనుగొన్నారని, తదుపరి విచారణ కోసం పడవతో పాటు దాని సిబ్బందిని..
గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), భారత తీర రక్షక దళం సోమవారం నాడు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భారీ ఎత్తున హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్ర తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో తొమ్మిది మంది సిబ్బందితో కూడిన పాకిస్తాన్ బోట్‌ను పట్టుకున్నారు. ఓడ నుండి రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పాకిస్థాన్ బోట్ 'అల్ హజ్' భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు భారత తీర రక్షక దళ నౌకలు అడ్డగించి పట్టుకున్నాయని రక్షణ ప్రతినిధి తెలిపారు.
బోటులో రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు కనుగొన్నారని, తదుపరి విచారణ కోసం పడవతో పాటు దాని సిబ్బందిని గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి తీసుకువచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది సిబ్బందిని గుజరాత్ తీరంలోని జాఖావో ఫిషింగ్ హార్బర్ కు తీసుకుని వచ్చారు. ATS కు పాకిస్తాన్ నుండి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు సమాచారం అందింది. భారత కోస్ట్ గార్డ్ సహాయంతో ఈ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు.
"In a joint Ops with ATS #Gujarat, @IndiaCoastGuard Ships apprehended Pak Boat Al Haj with 09 crew in Indian side of Arabian sea carrying heroin worth approx 280 cr. Boat being brought to #Jakhau for further investigation. @DefenceMinIndia @MEAIndia @HMOIndia @SpokespersonMoD",అంటూ ఇండియన్ కోస్ట్ గార్డు ట్వీట్ చేసింది.
తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న అల్-హజ్ బోట్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భారత జలాల్లో కనిపించిందని ఐసీజీ అధికారి ఒకరు తెలిపారు. "ICG బృందం పడవను అడ్డగించింది నిషేధిత సామగ్రితో ఉన్న సిబ్బందిని పట్టుకుంది." ఇంటెలిజెన్స్ దృష్ట్యా పెట్రోలింగ్ నౌకలను అప్రమత్తం చేశామని, 24 గంటలూ నిఘా ఉంచామని అధికారి తెలిపారు. తొమ్మిది మందిని విచారిస్తున్నట్లు అధికారి తెలిపారు. తొమ్మిది మందిలో కొందరు మత్స్యకారులలా కనిపించడం లేదని, అందువల్ల వారి గుర్తింపులను ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Next Story