Tue Apr 01 2025 00:38:13 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షకు పైగా జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
నిరుద్యోగులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్ష రూపాయలకు పైగానే జీతంతో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది

నిరుద్యోగులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్ష రూపాయలకు పైగానే జీతంతో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎయిర్ పర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 206 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మార్చి24వ తేదీన...
అయితే రాత పరీక్ష నిర్వహించిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయనునున్నారు. జూనియర్ అసిస్టెంట్ కు 31 వేల రూపాయల నుంచి తొంభయి రెండు వేల రూపాయలు, సీనియర్ అసిస్టెంట్లకు ముప్ఫయి ఆరు వేల నుంచి లక్షా పది వేల రూపాయల వరకూ జీతం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ మార్చి 24వ తేదీగా నిర్ణయించారు. మరిన్నివివరాలకు https://www.aai. aero/en/careers/ వెబ్ సైట్ ను చూడవచ్చు.
Next Story