Thu Dec 19 2024 13:40:09 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్‌షోలో భారత్ బిగ్ డీల్
బెంగళూరులో జరుగుతున్న ఎయిర్‌షోలో భారత ప్రభుత్వం బిగ్ డీల్ ను కుదుర్చుకుంది.
బెంగళూరులో జరుగుతున్న ఎయిర్‌షోలో భారత ప్రభుత్వం బిగ్ డీల్ ను కుదుర్చుకుంది. దాదాపు ఐదు వందల విమానాల ఆర్డర్ ను కుదర్చుకుంది. ఎయిర్ బస్, బోయింగ్ విమానాలు 500 కొనుగోలుకు ఎయిర్ ఇండియా డీల్ కుదుర్చుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ లో రతన్ టాటా కూడా పాల్గొన్నారు.
ఎయిర్‌బస్ ఒప్పందం...
భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఎయిర్‌బస్ ఒప్పందం కుదిరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఫ్రాన్స్ నుంచి 250 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఎయిర్ షోలో స్వదేశీ పరిజ్ఞానం కలిగిన పలు విమానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా భారత్ పేరు మరింత ఇనుమడించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Next Story