Mon Dec 23 2024 11:14:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియన్ ఐడల్ 13 విన్నర్ గా రిషి సింగ్.. ప్రైజ్ మనీ ఎంతంటే ?
ఆదివారం రాత్రి ముంబైలో నిర్వహించిన గ్రాండ్ ఫినాలే కార్యక్రక్రమంలో విజేతగా నిలిచిన రిషిసింగ్ రూ.25 లక్షల చెక్కుతో..
ప్రముఖ సోనీ ఛానల్ నిర్వహించే సింగింగ్ కాంపిటేషన్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్యకు చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబైలో నిర్వహించిన గ్రాండ్ ఫినాలే కార్యక్రక్రమంలో విజేతగా నిలిచిన రిషిసింగ్ రూ.25 లక్షల చెక్కుతో పాటు మారుతి సుజుకి బ్రీజా కారును కూడా బహుమతిగా గెలుచుకున్నాడు. రిషి సింగ్ తర్వాతి స్థానంలో తొలి రన్నరప్ గా కోల్ కతాకు చెందిన దేబాస్మితా రాయ్ నిలవగా, జమ్ముకశ్మీర్ సింగరైన చిరాగ్ కొత్వాల్ సెకండ్ రన్నరప్ గా నిలిచాడు. వీరిద్దరికీ చెరొక రూ.5 లక్షల నగదు బహుమతిగా అందించారు.
ఇండియన్ ఐడల్ 13వ సీజన్ గ్రాండ్ ఫినాలే కు సోనాక్షికర్, శివమ్ సింగ్, బిదీప్త చక్రవర్తి చేరగా.. హిమేష్, విశాల్ దద్లానీ, నేహా కక్కర్ జడ్జిలుగా వ్యవహరించారు. టాప్ 6 పోటీదారులతో గట్టి పోటీని తట్టుకొని రిషి సింగ్ తన గాత్రంతో మెప్పించాడు. విన్నర్ గా నిలిచిన రిషి.. తానొక అనాథ అని, తనకు తల్లిదండ్రులు లేరని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా తనను దత్తత తీసుకుని ఉంటే ఈరోజు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై విజేతగా మాత్రం ఉండేవాడిని కాదన్నాడు. ఇండియన్ ఐడల్ 13 విన్నర్ కు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story