Mon Dec 23 2024 13:55:59 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ ఇక అంతా కూల్.. కూల్
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వడగాల్పులు ఉండవని తెలిపింది
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వడగాల్పులు ఉండవని తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగినా వడగాలులు ఉండవని చెప్పింది. ఇప్పటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో పాటు తీవ్రమైన వడగాలులు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఇంట్లో కూడా కుదరుగా ఉండలేని పరస్థితి నెలకొంది.
ఆ రెండు రాష్ట్రాల్లో మినహా...
అయితే భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని తెలిపింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Next Story