Sun Dec 22 2024 21:50:31 GMT+0000 (Coordinated Universal Time)
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఐఆర్ సీటీసీ కొత్త ఆఫర్
ఈ మేరకు క్యాష్ ఈ, పేటీఎం, ఈ పే లేటర్ సంస్థలతో ఐఆర్ సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎంలో ఐఆర్ సీటీసీ పోర్టల్ లో..
ఆన్లైన్లో షాపింగ్ చేసి.. ఆ మొత్తం డబ్బును విడతల వారీగా లేదా కొనుగోలు చేసిన తర్వాత చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆప్షన్ ను రైలు ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్ సీటీసీ. బై నౌ పే లేటర్ సదుపాయంలో స్వల్ప మార్పులు చేసి.. ట్రావెల్ నౌ పే లేటర్ (టీఎన్ పీఎల్) అంటూ కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. ఇకపై సమయానికి చేతిలో డబ్బుల్లేవని ప్రయాణాలను మానుకోవాల్సిన అవసరం లేకుండా.. ముందు ప్రయాణించి తర్వాత డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది.
ఈ మేరకు క్యాష్ ఈ, పేటీఎం, ఈ పే లేటర్ సంస్థలతో ఐఆర్ సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎంలో ఐఆర్ సీటీసీ పోర్టల్ లో లాగిన్ అయి, ప్రయాణ వివరాలను ఎంటర్ చేసి బుక్ టికెట్ పై క్లిక్ చేయాలి. పేమెంట్ సెక్షన్లో పే లేటర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి.. పేటీఎం పోస్ట్ పెయిడ్ ను ఎంపిక చేసి, పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయడంతో టికెట్ బుకింగ్ పూర్తవుతుంది.
క్యాష్ ఈ లో ఈఎంఐ కింద 3 నుంచి ఆరు నెలల్లో టికెట్ బుకింగ్ సొమ్మును చెల్లించే వెసులుబాటు ఉంటుంది. పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయడంతో టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇందులో టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 14 రోజుల్లోగా సొమ్ము చెల్లించాలి. ఆ గడువు దాటితే చెల్లించాల్సిన సొమ్ముపై 36 శాతం వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది.
Next Story