Mon Feb 03 2025 15:19:48 GMT+0000 (Coordinated Universal Time)
ISRO : సెంచరీకి సిద్ధమయిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమయింది
వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమయింది. ఇప్పటివరకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 99 రాకెట్ ప్రయోగాలు చేసిన ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేది ఉదయం 6 గంటల 23 నిమిషాలకు శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్ వీ ఎఫ్15 ను నింగిలోకిపంపనున్నారు.
ఈ ప్రయోగం ద్వారా...
ఈ ప్రయోగం ద్వారా ఎన్ వి ఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ఇస్రో పంపనుంది. దీంతో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం సరికొత్త రికార్డును సృష్టించేందుకు రెడీ అయింది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు శాస్త్రవేత్తలు చేశారు. సెంచరీ కొట్టబోతున్న ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు సిబ్బందిని దేశ వ్యాప్తంగా ప్రముఖులు అభినందిస్తున్నారు.
Next Story