Mon Dec 23 2024 09:30:58 GMT+0000 (Coordinated Universal Time)
కొంప ముంచిన కరివేపాకు : భారీ జరిమానా
భారతీయ మహిళ ను కరివేపాకు ఇబ్బంది పెట్టింది. భారీ జరిమానాకు గురి చేసింది.
భారతీయ వంటకాల్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని వంటల్లో వాడకుండా ఉండలేరు. అలాంటి కరివేపాకు ఒక మహిళ ను ఇబ్బంది పెట్టింది. భారీ జరిమానాకు గురి చేసింది. న్యూజిలాండ్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక భారతీయ మహిళ కరివేపాకును తీసుకెళుతుండగా కస్టమ్స్ పోలీసులు పట్టుకున్నారు.
జరిమానా...
రెండు వందల న్యూజిలాండ్ డాలర్ల జరిమానాను భారతీయ మహిళకు విధించారు. కరివేపాకును తీసుకెళ్లడమే ఆ మహిళ చేసిన తప్పిదం. ఆ మహిళ ఎంత నచ్చ చెప్పినా కస్టమ్స్ అధికారులు వినిపించుకోలేదు. దీంతో 200 డాలర్లు చెల్లించిన భారతీయ మహిళ ఉసూరుమంటూ వెళ్లి పోవాల్సి వచ్చింది.
Next Story