Mon Dec 23 2024 09:03:50 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తొలి H3N2 మరణం నమోదు
కరోనా నుంచి బయటపడ్డామని సంతోషించే లోపే ఏదొక వైరస్ గుబులు రేపుతూనే ఉంది. జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం..
దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కర్ణాటకలోనూ మరోవ్యక్తి కూడా ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. H3N2 ఇన్ ఫ్లూయెంజా బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉందని.. ఇప్పటికీ దేశంలోని వివిధరాష్ట్రాల్లో H3N2 బాధితుల సంఖ్య 90కి పైగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు, జ్వరం, కళ్లుమంటల లక్షణాలతో వందలాదిమంది ఆస్పత్రులకు క్యూ కట్టడం భయాందోళనలు రేపుతోంది. కరోనా నుంచి బయటపడ్డామని సంతోషించే లోపే ఏదొక వైరస్ గుబులు రేపుతూనే ఉంది. జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం వంటివి H3N2 లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. జలుబు, జ్వరం వస్తే అశ్రద్ధ చేయవద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వీటికి అదనంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. మరోవైపు ఐసీఎంఆర్ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్లతో కూడిన బెడ్లను సిద్ధం చేయాలని తెలిపింది.
Next Story