Sat Nov 23 2024 00:57:59 GMT+0000 (Coordinated Universal Time)
శరీర వ్యవస్థ పైనే కాదు.. మనసులపైనా దెబ్బకొడుతోన్న కరోనా !
5.6 కోట్ల మంది డిప్రెషన్ (మానసిక దిగులు/కుంగుబాటు), 4.3 కోట్ల మంది ఆందోళన సమస్యతో బాధపడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తు
పూర్తి ఆరోగ్యంగా ఉండటం అంటే.. శరీరం మాత్రమే ధృడంగా ఉంటే సరిపోదు. మనసు కూడా పటిష్టంగా ఉండాలి. అప్పుడే వాళ్లు పూర్తి ఆరోగ్యవంతులవుతారు. కానీ కరోనా మనుషుల శరీర వ్యవస్థపైనే కాకుండా.. మనసులపైనా దెబ్బకొట్టిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ చేయడం, ఒక గదిలో ఉంచడం, కరోనా కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోవడం, ఉద్యోగాలు పోయి, ఆదాయాన్ని ఇలా పలు కారణాల చేత చాలామంది మానసిక కుంగుబాటుకు గురవుతున్నట్లు తేలింది.
Also Read : పిల్లల కోసం ఆ రెండింటికీ రెడీ : కరాటే కల్యాణి
5.6 కోట్ల మంది డిప్రెషన్ (మానసిక దిగులు/కుంగుబాటు), 4.3 కోట్ల మంది ఆందోళన సమస్యతో బాధపడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చాక దేశంలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య 22 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా 700 మంది ఆత్మహత్య చేసుకుంటుండగా.. వాటిలో ఎక్కువ 15-39 వయసు గ్రూపు నుంచే ఎక్కువ ఆత్మహత్యలు ఉంటున్నాయి. ఉద్యోగం లేకపోవడం, హింస, కుటుంబ తగాదాలు, పరీక్షల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఆత్మహత్యలకు కారణాలుగా నిలుస్తున్నాయి.
దేశంలో పెరుగుతున్న మానసిక సమస్యలను నియంత్రించలేకపోతే.. ఉత్పాదకతను నష్టపోయే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 2012 నుంచి 2030 మధ్య భారత్ 1.03 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని చూడవచ్చని అంచనా వేసింది. వివక్ష, పేదరికం, ఉద్యోగ అభద్రత, సామాజిక అసమానతలు ఇవన్నీ మానసిక అనారోగ్యానికి దారితీసే అంశాలే. అభివృద్ధి చెందిన దేశాలు ఏటా తమ హెల్త్ కేర్ బడ్జెట్ లో 18 శాతం వరకు మానసిక వ్యాధుల కోసమే కేటాయిస్తున్నాయి. కానీ భారత్ లో మాత్రం ఇది 0.05 శాతంగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత్ లో ప్రతి లక్ష జనాభాకు 0.3 శాతమే సైకియాట్రిస్ట్ లు, 0.12 శాతం నర్సులు, 0.07 శాతం సైకాలజిస్ట్ లు అందుబాటులో ఉన్నారు.
Next Story