Tue Dec 24 2024 14:12:50 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో నూతన చైర్మన్ గా వెంకటరమణి సుమంత్రన్ ఎంపిక
దామోదరన్ కు 75 ఏళ్లు నిండిన సందర్భంగా చైర్మన్ బాధ్యతల నుంచి ఆయన వైదొలగారు. కొత్త చైర్మన్ సుమంత్రన్ కు ఇండిగో..
జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన చైర్మన్ గా వెంకటరమణి సుమంత్రన్ నియమితులయ్యారు. ఇండిగో ఎయిర్ లైన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయనను ఛైర్మన్ గా ఎంపిక చేశారు. సుమంత్రన్ 2020 మే 28 నుంచి ఇండిగో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ గా ఉన్నారు. తాజాగా మాజీ ఛైర్మన్ దామోదరన్ నుంచి ఇండిగో చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు.
దామోదరన్ కు 75 ఏళ్లు నిండిన సందర్భంగా చైర్మన్ బాధ్యతల నుంచి ఆయన వైదొలగారు. కొత్త చైర్మన్ సుమంత్రన్ కు ఇండిగో ఎండీ రాహుల్ భాటియా ఆహ్వానం పలికారు. అంతర్జాతీయ సర్వీసులను విస్తరించే క్రమంలో సుమంత్రన్ అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందని భాటియా అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్లు, అంతర్జాతీయ లావాదేవీలు తదితర అంశాల్లో సుమంత్రన్ కు చాలా అనుభవం ఉందని, ఆయన నేతృత్వంలో ఇండిగో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశించారు. సుమంత్రన్ 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో.. అమెరికా, యూరప్, ఆసియా ఖండాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
Next Story