Sun Dec 22 2024 18:23:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
చెన్నై నుంచి ముంబయి వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
చెన్నై నుంచి ముంబయి వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమయిన అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారని తెలిపింది.
సురక్షితంగానే...
ముంబయిలో ఫ్లయిట్ ల్యాండ్ అయిన తర్వాత తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి బాంబు లేవని కనుగొన్నామని తెలిపారు. నిన్న అనేక విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొందరు ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులకు దిగారు. వీటితో అనేక విమానాశ్రయాల్లో విమానాలను నిలిపివేసి తనిఖీలు జరిపారు. దీంతో ప్రయాణాలు ఆలస్యమై ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
Next Story