Sat Apr 12 2025 21:57:26 GMT+0000 (Coordinated Universal Time)
flight : పైలట్ ను చితకబాదిన ప్రయాణికుడు.. అంత ఫ్రస్టేషన్ ఎందుకంటే?
ఇండిగో విమాన పైలట్ ను ప్రయాణికుడు తీవ్రంగా కొట్టాడు. గోవా వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది

ఇండిగో విమాన పైలట్ ను ప్రయాణికుడు తీవ్రంగా కొట్టాడు. అసహనంతో ఊగిపోయిన ప్రయాణికుడు పైలట్ ను చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం పదమూడు గంటల పాటు ఆలస్యం అయిందన్న కారణంతో తన ఆక్రోశాన్ని పైలట్ పై చూపడంతో తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు.
గోవా వెళ్లాల్సిన విమానం...
గోవా వెళ్లాల్సిన విమానం పదమూడు గంటల పాటు ఆలస్యం కావడంతో విమానంలోని ప్రయాణికుడిలో అసహనం కన్పించింది. పైలట్ త్వరలో టేకాఫ్ అవుతుందని పైలట్ చెబుతున్న సమయంలో అతడిపై ప్రయాణికుడు దాడి చేశాడు. అయితే వెంటనే తోటి ప్రయాణికులు అతనిని అడ్డుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story