హైదరాబాద్ వస్తున్న విమానం కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇక తాజా ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ వివరణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే పైలట్ విమానాన్ని కరాచీలో
తెలంగాణ రాజధాని హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం పాకిస్థాన్ లోని కరాచీ లో ల్యాండ్ అయింది. ప్రయాణికులతో షార్జా నుంచి వస్తున్న ఈ విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్ ఆ విమానాన్ని కరాచీ వైపు మళ్లించాడు. ఆపై కరాచీ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. టెక్నికల్ లోపాన్ని ముందే గుర్తించిన పైలెట్. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించి దించాల్సి వచ్చింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ప్రకటనలో విడుదల చేసింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఇండిగో తెలిపింది. ప్యాసింజర్స్ ను హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని పంపినట్టుగా తెలిపింది. భారత ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ అవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి.ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానాన్ని కూడా జులై 5న పాక్‌లోని కరాచీకి మళ్లించారు. ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయలేదని ల్యాండ్ చేశారు. అప్పటి ఎస్జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్‌జెట్ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్‌ను భారత్ నుంచి పంపించారు. ఈ ఘటన గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.