Mon Dec 23 2024 09:58:56 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ఐఏ డైరెక్టర్ గా దిన్కర్ గుప్తా
జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి దిన్కర్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి దిన్కర్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. గుప్తా రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. దినకర్ గుప్తా నియమాక ఉత్తర్వులను కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దిన్కర్ గుప్తా పంజాబ్ క్యాడర్ కు చెందిన అధికారి. 1987 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 2024 మార్చి 31వ తేదీ వరకూ పదవిలో ఉంటారు.
స్వాగత్ దాస్ ను...
దినకర్గుప్తా అనేక కీలక పోస్టుల్లో విధులు నిర్వహించారు. దీంతో పాటు స్వాగత్ దాస్ ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా నియమించారు. స్వాగత్ దాస్ 1987 ఐపీఎస్ అధికారి. ఈయన 2024 నవంబరు 30వ తేదీ వరకూ పదవిలో కొనసాగుతారు. ఈ రెండు నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది.
Next Story