Fri Nov 22 2024 17:58:28 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయాణికులకు IRCTC సూచన.. టికెట్ బుక్ అవ్వకపోతే ఇలా చేయండి
అయితే రిజర్వేషన్లు చేసుకునేవారి కోసం IRCTC కీలక సూచన జారీ చేసింది. టికెట్ బుకింగ్ కోసం IRCTC వెబ్ లేదా యాప్ లను..
దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వరదలు సంభవించడంతో.. ఒకప్రాంతం నుంచి మరోప్రాంతానికి అత్యవసరంగా వెళ్లాలన్నా రోడ్డుమార్గంలో ప్రయాణించే అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక రైలు ప్రయాణమే అందుకు ప్రత్యామ్నాయం. భారీ వర్షాల నేపథ్యంలో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ఉద్యోగులు, విద్యార్థులు సైతం.. లోకల్, మెట్రో రైళ్ల ప్రయాణాలకే మొగ్గుచూపుతున్నారు. ఇక ఒక నగరం నుంచి మరో నగరానికి లేదా మరో రాష్ట్రానికి వెళ్లేందుకు ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.
అయితే రిజర్వేషన్లు చేసుకునేవారి కోసం IRCTC కీలక సూచన జారీ చేసింది. టికెట్ బుకింగ్ కోసం IRCTC వెబ్ లేదా యాప్ లను ఉపయోగించి టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే ఈ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా IRCTC ట్విట్టర్ వేదికగా తెలిపింది. టికెట్ల బుకింగ్ లో చెల్లింపులు జరగడం లేదని, ప్రత్యామ్నాయంగా ఆస్క్ దిశాను సంప్రదించాలని సూచించింది. టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు Amazon, Makemytrip ల ద్వారా చేసుకోవాలని తెలిపింది. అయితే వాటిద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో.. యూజర్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. వెబ్ సైట్ లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని త్వరలోనే సరిచేస్తామని IRCTC వెల్లడించింది. ప్రయాణికులు దయచేసి సహకరించాలని కోరింది.
Next Story