Sun Dec 22 2024 21:04:26 GMT+0000 (Coordinated Universal Time)
NIA Raids: 44 చోట్ల ఎన్ఐఏ ఆకస్మిక దాడులు..15 మంది అరెస్ట్
దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా NIA-జాతీయ
దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా NIA-జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం తెల్లవారు జామున మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ఐసిస్ మాడ్యూల్ నాయకుడితో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని పడఘా - బోరివలీ, ఠాణె, పుణె.. అటు కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందం ఏకకాలంలో ఈ దాడులు చేపట్టింది. దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదుతోపాటు తుపాకులు, ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ బృందం తెలిపింది.
Next Story