Fri Nov 22 2024 09:43:32 GMT+0000 (Coordinated Universal Time)
భూకక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్
చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను
చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఇది ప్రత్యేక ప్రయోగమని.. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్న ఇస్రోకు తాజా ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. నమూనాలను తీసుకొని తిరిగి వస్తే ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారం భవిష్యత్ ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది.
భారతదేశ అంతరిక్ష సంస్థ చంద్రుడి నుండి నమూనాలను తిరిగి తీసుకురావడానికి ఈ ప్రయోగంతో మరొక అడుగు ముందుకు వేసింది. 2040 నాటికి చంద్రునిపై భారతీయుడిని ల్యాండ్ చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడం కూడా ఈ ప్రయోగం వెనకున్న ఉద్దేశ్యమని తెలుస్తోంది. చంద్రయాన్ కోసం ల్యాండర్-రోవర్‌ను చంద్రునిపైకి తీసుకువెళ్లడానికి ఉపయోగించే ప్రొపల్షన్ మాడ్యూల్- 3 మిషన్‌ను తిరిగి భూమి చుట్టూ కక్ష్యలోకి తీసుకువచ్చినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం ప్రకటించింది. ప్రొపల్షన్ మాడ్యూల్ ఒక సంవత్సరం పాటు భూమి చుట్టూ కక్ష్యలో ఉంటుంది. ఇస్రో అంతరిక్ష నౌకను చంద్రుని చుట్టూ మూడుసార్లు విజయవంతంగా కక్ష్యలోకి తీసుకువెళ్లగా, దాన్ని తిరిగి తీసుకురావడం ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ ఈ ఏడాది ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. 'విక్రమ్ ల్యాండర్', 'ప్రజ్ఞాన్ రోవర్' పరికరాల సాయంతో వివిధ ప్రయోగాలను పూర్తి చేశారు. చందమామ దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర లిఖించింది.
Next Story