Fri Nov 22 2024 09:15:28 GMT+0000 (Coordinated Universal Time)
టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ 'సక్సెస్'
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టిన తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1)ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో కిందకు సురక్షితంగా సముద్రంలోకి దిగింది. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.
అంతకు ముందు సాంకేతిక లోపం కారణంగా పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) హోల్డ్ చేసింది. ప్రయోగ తేదీని తర్వాత ప్రకటిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామన్నారు. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది. శనివారం ఉదయం 8.00 గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. తొలుత వాతావరణం అనూకూలించక 8.45 నిమిషాలకు రీషెడ్యూల్ చేశారు. అనంతరం చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్‌లో పెట్టారు.
Next Story