Mon Dec 23 2024 09:51:10 GMT+0000 (Coordinated Universal Time)
ఇస్రోలో విషాదం.. ఆమె మృతి
శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్డౌన్ల సమయంలో తన స్వరం వినిపించే
శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్డౌన్ల సమయంలో తన స్వరం వినిపించే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వాలర్మతి కన్నుమూశారు. ఆమె గుండెపోటుతో మరణించారని అధికారులు తెలిపారు. ఆమె చివరిసారిగా చంద్రయాన్-3 సమయంలో కౌంట్‌డౌన్ చెప్పారు.జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు. ఆగష్టు 23న, చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి మీద ల్యాండ్ అయింది.
భారత అంతరిక్ష సంస్థ ప్రయోగాల కౌంట్ డౌన్ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్మతి మృతి చెందారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవలి చంద్రయాన్-3 మిషన్‌లో చివరిసారిగా కౌంట్ డౌన్ విధులు నిర్వర్తించారు. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్ వేళ తన స్వరం వినిపించిన వాలర్మతి గొంతు మూగబోయిందని ఇస్రో తెలిపింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మరణించారని.. ఆమె చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలను నిర్వర్తించారని.. ఆమె సేవలు మరువలేమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
Next Story